ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలిని ర్యాలీ

– గాంధీ విగ్రహనికి వినతి పత్రం అందజేసిన సిఐటియు నాయకులు 

నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్ 
ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం హుస్నాబాద్ పట్టణంలో ఆశ వర్కర్లు ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా  సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆశ వర్కర్లు 28,000 మంది పనిచేస్తుంటే వారికి ఫిక్స్డ్ వేతనం ఇవ్వకుండా పారితోషకాల పేరుతో తక్కువ వేత్తనాలు ఇస్తున్నారని అన్నారు..ఉద్యోగ భద్రత, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పిస్తూ, పని బారం తగ్గించాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ యూనియన్ నాయకురాలు రజిత, వాణి, శోభారాణి, అనిత,అనసూర్య, స్వప్న, స్వరూప తదితరులు పాల్గొన్నారు.