నవతెలంగాణ-బోధన్
పట్టణంలో కార్గిల్ విజరు దివస్ సందర్భంగా శుక్రవారం బిఆర్‌ఎస్వి ఆధ్వర్యంలో విద్యార్థులు 500 మీటర్ల పొడవు గల జాతీయ జెండాను ప్రదర్శిస్తూ బోధన్ పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. కార్గిల్ రజతోత్సవాల విజరు దివస్ సందర్బంగా 500 మీటర్ల జాతీయ జెండాతో శక్కర్‌నగర్ చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా మీదుగా మారుతీ మందిర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్‌ఎస్వి పట్టణ అధ్యక్షులు వడ్ల సతీష్ కుమార్ చారి మాట్లాడుతూ.. 1999లో కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్‌తో భీకర యుద్ధం చేసి కాశ్మీర్‌లోని కార్గిల్ జిల్లాని పాకిస్తాన్ ఆక్రమించిన కార్గిల్‌ని తిరిగి సాధించారని అన్నారు. కార్గిల్ యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన 527 మంది భారత సైనికులకు నివాళులర్పించారు. భారత దేశంతో ఆత్మీయతతో ఉంటే అమ్మలా గౌరవిస్తాం, సన్నిహితంగా ఉంటే చేయూత ఇస్తాం, అదే మా దేశంపైన కాలు దువ్వూతే ఆ దేశాన్ని చీల్చి చెండాడు తామని హెచ్చరించారు. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన పాకిస్తాన్ సైన్యంకి కూడా భారత దేశ సైన్యం అంతక్రియలు చేసి ప్రపంచానికి మానవత్వం చాటి చెప్పిందని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.