న్యూఢిల్లీ : వేదాంత్ ఫ్యాషన్ లిమిటెడ్‌కు చెందిన మాన్యావర్ బ్రాండ్ తన వెడ్డింగ్ కలెక్షన్‌లో ఆ సంస్థ బ్రాండ్ అంబాసిడర్ నటుడు రామ్ చరణ్ కొత్త కలెక్షన్‌ను ఆవిష్కరించారు. తాజాగా వివాహ కలెక్షన్‌లో భాగంగా పంచకచం, వేష్టికి సంబంధించిన వస్త్రాలను దక్షిణాదిలోకి విడుదల చేసినట్లు ఆ సంస్థ పేర్కొంది. ఇవి దక్షిణాది వారసత్వానికి ప్రతీకగా నిలుస్తాయని తెలిపింది. ఇందులో రామ్ చరణ్‌కు జోడీగా శోభిత దూళిపాళ్ల నటించారు.