రామ్‌చరణ్ కథానాయకుడిగా, డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొం దిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాను అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడి యోస్, దిల్‌రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన నటుడు శ్రీకాంత్ శనివారం మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు. ‘దర్శకుడు శంకర్‌తో పని చేయాలని ప్రతీ ఒక్క ఆర్టిస్ట్‌కు ఉంటుంది. ఈ కథ గురించి ఆయన చెప్పినప్పుడు నేను కచ్చితంగా నటించాలని అనుకున్నాను. నా క్యారెక్టర్, గెటప్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. తొలిసారి ప్రోస్థటిక్ మేకప్‌లో నటించడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. నా పాత్రలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. అలాగే ట్విస్టులు, చాలా సస్పెన్స్‌లు ఉంటాయి. గెటప్ చూసిన వెంటనే ఆ క్యారెక్టర్ తాలుకా షేడ్స్ అన్నీ ప్రేక్షకులకు అర్థం అవుతాయి. సినిమాకు చాలా ముఖ్యమైన క్యారెక్టర్. అలాగే ఎస్‌జే సూర్య పాత్ర చాలా డిఫరెంట్‌గా, ‘సరిపోదా శనివారం’ పాత్రను మించేలా ఉంటుంది. ఇక అప్పన్న పాత్రను రామ్‌చరణ్ పోషించిన తీరు చూస్తే అంతా షాక్ అవుతారు. చాలా కొత్తగా అనిపిస్తాడు. శంకర్ ప్రతీ సినిమాల్లో ఉండేలానే ఇందులోనూ సామాజిక సందేశం ఉంటుంది. రెగ్యులర్ ఫిల్మ్స్ కాకుండా డిఫరెంట్ పాత్రలను ఎంచుకుంటున్నాను. సాయిధరమ్ తేజ్ ‘సంబరాల ఏటుగటు’్ట, కళ్యాణ్‌రామ్ మూవీతోపాటు సుష్మిత గోల్డెన్‌బాక్స్‌లో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాను. నా కొడుకు రోషన్ ప్రస్తుతం ‘ఛాంపియన్’ చిత్రాన్ని చేస్తున్నాడు. మేం ఇద్దరం కలిసి ఇప్పట్లో అయితే నటించం’.