డ్రోన్స్‌ రంగంలోకి రామ్‌ ఇన్ఫో

డ్రోన్స్‌ రంగంలోకి రామ్‌ ఇన్ఫోహైదరాబాద్‌ : కిసాన్‌ డ్రోన్స్‌ ప్రయివేటు లిమిటెడ్‌ను ప్రారంభించినట్లు టెక్నాలజీ కంపెనీ రామ్‌ఇన్ఫో లిమిటెడ్‌ తెలిపింది. ఇది వ్యవసాయ రంగం వైపు ఒక ముఖ్యమైన ముందడుగు అని పేర్కొంది. ”అధునాతన సాంకేతికత ద్వారా వ్యవసాయ రంగానికి సాధికారత కల్పించడం కోసం మేం చేస్తున్న ప్రయాణంలో ఒక ముఖ్యమైన మెట్టు కిసాన్‌ డ్రోన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌. వచ్చే రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశాలో 100 కేంద్రాలను ప్రారంభించాలని ఈ ఇన్షియేటివ్‌ యోచిస్తోంది.” అని రామ్‌ ఇన్ఫో ఎండి ఎల్‌ శ్రీనాథ్‌ రెడ్డి తెలిపారు.