రామ్‌ నగర్‌ బన్నీ రిలీజ్‌కి రెడీ

Ram Nagar Bunny is ready for releaseచంద్రహాస్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘రామ్‌ నగర్‌ బన్నీ’. విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దివిజ ప్రభాకర్‌ సమర్పణలో మలయజ ప్రభాకర్‌, ప్రభాకర్‌ పొడకండ నిర్మిస్తున్నారు. శ్రీనివాస్‌ మహత్‌ (వెలిగొండ శ్రీనివాస్‌) దర్శకుడు. ఈనెల 4వ తేదీన ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ మాట్లాడుతూ, ‘ఈ సినిమా మంచి కంటెంట్‌తో వస్తున్నట్లు టీజర్‌, ట్రైలర్‌తో తెలుస్తోంది. చంద్రహాస్‌ ప్రామిసింగ్‌గా, ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నాడు. బాగా పర్‌ఫార్మ్‌ చేస్తున్నాడు. ఈ సినిమా చంద్రహాస్‌తో పాటు ప్రభాకర్‌కు పెద్ద సక్సెస్‌ ఇవ్వాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. ‘ఈ సినిమాకు మాకంటే ప్రభాకర్‌ రెట్టింపు కష్టపడ్డాడు. చంద్రహాస్‌ ఇది నా సినిమా అనుకుని అన్నింటిలో ది బెస్ట్‌ ఇచ్చాడు. డ్యాన్స్‌, ఫైట్స్‌, పర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంటాడు’ అని డైరెక్టర్‌ శ్రీనివాస్‌ మహత్‌ చెప్పారు. సమర్పకురాలు దివిజ మాట్లాడుతూ, ‘అన్ని వర్గాలను అలరించే రీతిలో ఈ చిత్రాన్ని రూపొందించాం’ అని తెలిపారు. ‘మా మూవీని రిలీజ్‌ చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్‌ వారికి థ్యాంక్స్‌. వాళ్లు మా సినిమాకు ఎంతో సపోర్ట్‌ అందిస్తున్నారు. ప్రతి పేరెంట్‌ మా సినిమా చూడాలి. మీకు తప్పకుండా సినిమా నచ్చుతుంది. సినిమా చూశాక మీరే మరో పదిమందికి మూవీ బాగుందని చెబుతారు’ అని నిర్మాతలు చెప్పారు.