నవతెలంగాణ -తాడ్వాయి
మేడారంలోని సమ్మక్క సారలమ్మ వనదేవతలను రెడ్డి సంక్షేమ సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు రామ్ రెడ్డి బంధుమిత్రులతో ఆదివారం దర్శించుకుని ప్రత్యేక మొక్కలు చెల్లించారు. వీరికి సమ్మక్క పూజారి సిద్ధబోయిన స్వామి, పగిడిద్దరాజు పూజారి అర్రెం లచ్చు పటేల్ మిగతా పూజారులు, ఎండోమెంట్ అధికారులు ఆలయ సాంప్రదాయాల ప్రకారం ఘనంగా స్వాగతం పలికారు. సమ్మక్క- సారమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు వనదేవతలకు ఇష్టమైన పసుపు, కుంకుమ, చీరే, సారే సమర్పించి ప్రత్యేక మొక్కులు చెల్లిస్తారు. ఎండోమెంట్ అధికారులు శాలువాలు కప్పి అమ్మవారి ప్రసాదం అందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రామ్ రెడ్డి మాట్లాడుతూ వనదేవతలను దర్శించుకోవడం మహాభాగ్యంగా ఉందని అన్నారు. వారి వెంట బంధుమిత్రులు, రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు తదితరులు ఉన్నారు.