నవతెలంగాణ – రెంజల్
శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని రెంజల్ మండలంలోని రామాలయాలను గ్రామ అభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో ముస్తాబు చేశారు. మండలంలోని రెంజల్, బాగేపల్లి, నీలా క్యాంపు, వీరన్న గుట్ట, కందకుర్తి తదితర గ్రామాలలో ఆలయాలను ముస్తాబు చేశారు. బుధవారం అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. సీతారాముల కల్యాణోత్సవం అనంతరం భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.