
ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించిన విద్యార్థులు ఫెయిలైతే అది ఉపాధ్యాయుల నిర్లక్ష్యమే కారణం అన్నారు. గత ఫలితాలను దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం మెరుగైన ఫలితాలు సాధించడానికి ప్రయత్నించాలన్నారు. తన శిష్యుడు ఉన్నత స్థానానికి వెళితే గురువులు ఎంత గౌరవంగా భావిస్తారో, అదే ఫెయిలైతే అంతే అవమానంగా భావించాలన్నారు. 10వ తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలని సూచించారు. విద్యార్థులు అత్యధిక శాతం మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టుల్లోనే వెనుకబడి ఉన్నారని, ఆలాంటి వారిపై ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే ఫలితం ఉంటుందని సూచించారు. ఉత్తమ ఫలితాల కోసం ఎక్కువగా స్లిప్ టెస్టులు, మాక్ టెస్టులు నిర్వహించి వాటిపై రివిజన్ చేస్తే విద్యార్థులకు ఫైనల్ పరీక్షల భయం పోతుందన్నారు. రివిజన్ చేస్తే విద్యార్థులు మరిచిపోరని తెలిపారు. ప్రాక్టీస్ ఎక్కువగా చేయించేలా ప్రోత్సహించాలన్నారు. ఉపాధ్యాయులు ప్రతి రోజూ వేక్ అప్ కాల్ చేయాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి పిల్లల వెనుకబాటుపై చర్చించి వారికి తగు సూచనలు చేయాలన్నారు. కార్యక్రమంలో రమేష్, కోటేశ్వర్, సురేందర్, శివకుమార్, ప్రభాకర్, ఆంజనేయులు, యుగేందర్, గీతా, అరుణ, కరుణ, సీఆర్పీ లు వేముల సంతోష్, రంగన్న తదితరులు పాల్గొన్నారు.