నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని నాలుగేళ్లలో అవినీతి సొసైటీగా మార్చిన ఘనత తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ చెప్యాల రామారావుదేని వైస్ ఛైర్మన్ మల్కా ప్రకాష్ రావు ఆరోపించారు. గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు నాలుగేళ్లలో సొసైటీని ఎలాంటి అభివృద్ధి చేయకపోగా అవినితికి పాల్పడి సస్పెన్షన్ అయిన రామారావు తోపాటు పలువు డైరెక్టర్లను పెద్దపల్లి జెడ్పి చైర్మన్ పుట్ట మదుకర్ అభినందించడం దేనికి నిదర్శమో చెప్పాలన్నారు. తాను కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయానని మాట్లాడటం సరికాదని, పార్టీలు మారడం మీ తరువాతే ఎవరైనని తెలిపారు. అవినీతి చైర్మన్ దీంచడానికే సొసైటీలో ఉన్న రైతుల కోరిక మేరకే కాంగ్రెస్ పార్టీలో చేరి అవిశ్వాసం పెట్టడం జరిగిందన్నారు. పిఏసిఎస్ కార్యాలయనికి నాలుగేళ్ల క్రితం లాకర్ వస్తే నేటికి వాడుకంలోకి తీసుకరాలేదన్నారు. కార్యాలయంలో మరుగుదొడ్లు, ప్రహరీ గోడ, మౌలిక వసతుల ఏర్పాటులో చైర్మన్ రామారావు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.జెడ్పి చైర్మన్ స్థాయికి దిగి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్లు ఇప్ప మొoడయ్య, వొన్న తిరుపతి రావు, సంగ్గెం రమేష్, బానోతు సమ్మక్క, కాంగ్రెస్ ఎస్సిసెల్ జిల్లా అధ్యక్షుడు దండు రమేష్,మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య, యూత్ అధ్యక్షుడు గడ్డం క్రాoతి, చెంద్రయ్య, ప్రభాకర్, బొబ్బిలి రాజు,రాగం రమేష్ పాల్గొన్నారు.