రమాబాయి అంబేద్కర్ గొప్ప త్యాగమూర్తి..

నవతెలంగాణ – మునుగోడు: అణగారిన వర్గాలకు జరుగుతున్న అన్యాయాలపై అంబేద్కర్ జ్ఞాన యుద్ధం చేసేందుకు వెళ్లగా నలుగురు బిడ్డలను పోగొట్టుకున్న ఒక మహాతల్లి రమాబాయి అంబేద్కర్ అని పెరుమాల్ల ప్రమోద్ కుమార్ అన్నారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ సతీమణి మాతా రమాబాయి అంబేద్కర్ 127 వ జయంతి సందర్భంగా మునుగోడు అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యములో మాతా రమాబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు..ఆమె సేవలను కొనియాడారు..ఈ సందర్భంగా పెరుమాళ్ళ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ రమా బాయ్ అంబేద్కర్ ఒక దళిత నిరుపేద కుటుంబంలో జన్మించి, చిన్నప్పుడే వివాహం చేసుకొని,డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ చదువుకోవడానికి ఎన్నో కష్టాలు పడి కుటుంబ బారాని  మోసి,బహుజన బిడ్డల భవిష్యత్ కోసం తన బిడ్డలను త్యాగం చేసిన త్యాగమూర్తి మాతా రామాబాయి అంబేద్కర్ అని గుర్తుకు తెచ్చారు. సామాజిక సమరత్వం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి  రమాబాయి అంబేద్కర్ అన్నారు. యువతీ యువకులు రమాబాయి అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమములో పెరుమాల్ల ప్రమోద్ కుమార్, రెడ్డిమళ్ల యాదగిరి, ముచ్చపోతుల శ్రీకాంత్, నిరుడు సైదులు,బొల్లు సైదులు,పెరుమాల్ల ప్రణయ్ కుమార్, బెల్లపు బాల శివరాజ్,రెడ్డిమల్ల వెంకట్, బసనగర్ర రాము,జంగిలి నాగరాజు, గాలి జీవన్,బెల్లపు ప్రసాద్, ముచ్చపోతుల పవన్ అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.