
భారత రాజ్యాంగ నిర్మాత, బారత రత్న డా.బాబా సాహెబ్ అంబెడ్కర్ సతీమణి మాత రమాబాయి అంబేద్కర్ జయంతి సందర్బంగా బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్ పాండు రంగారెడ్డి శుక్రవారం నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ఈసందర్బంగా మాట్లాడుతూ విజయవంతమైన పురుషుడి వెనుక, ఒక స్త్రీ ఉంటుంది. అంబేడ్కర్ జీవితంలోనూ ఆయన భార్య రమాబాయి ఆయనను బాగా ప్రభావితం చేసిందని అన్నారు.ఫిబ్రవరి 7, 1898న ఆమె ఒక నిరుపేద దళిత కుటుంబంలో జన్మించారు. ఆమె 15 సంవత్సరాల వయసులో బాబా సాహెబ్ అంబేడ్కర్‌ను వివాహం చేసుకున్నారు. రమాబాయి లాంటి చాలా విధేయతగల జీవిత భాగస్వామిని పొందిన బాబాసాహెబ్ అదృష్టవంతుడని అన్నారు. సామాజిక న్యాయం, సంస్కరణల కోసం రమాబాయి తన భర్త చేపట్టిన పోరాటాన్ని చేపట్టి, ఆయన ప్రారంభించిన గొప్ప పనిని నిర్వహించడానికి అతనితో పాటు ఒక శిలలా నిలబడిందని కొనియాడారు.