
భారత రాజ్యాంగ నిర్మాత, బారత రత్న డా.బాబా సాహెబ్ అంబెడ్కర్ సతీమణి మాత రమాబాయి అంబేద్కర్ 126వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అల్ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ రిజిస్ట్రేషన్ 542 (ఏఈడబ్ల్యుఎస్) జాతీయ అధ్యక్షురాలు వేముల జ్యోతి, రాష్ట్ర అధ్యక్షుడు లింగమల్ల శంకర్ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 11న ఆదివారం మల్హర్ మండలంలోని కొయ్యుర్ కమ్యూనిటీ హాల్లో రమాబాయి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అల్ ఎంప్లాయిస్ సొసైటీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు లింగమల్ల శంకర్, కాళేశ్వరం జోనల్ యూత్ అధ్యక్షుడు చింతల కుమార్ యాదవ్ తెలిపారు. ఆదివారం మండలంలోని కొయ్యుర్ ప్రెస్ క్లబ్ లో జయంతి ఉత్సవాల ఆహ్వాన కరపత్రాలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడారు అల్ ఎంప్లాయిస్ సొసైటీ ఆధ్వర్యంలో సామాజిక కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో ఈ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు.మెరుగైన సమాజ నిర్మాణం కృషి చేయాలనుకునేవారు,మహనీయుల అభిమానులు మంథని,కాటారం డివిజన్ల నుంచి ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, అంబేద్కర్ వాదులు, విద్యార్థులు, మేధావులు,కులమత,లింగ విబేధాలు లేకుండా సబండా వర్గాల ప్రజలు వందలాదిగా స్వచ్ఛందగా తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.ఈ ఉత్సవాలకు హాజరైన ప్రతి ఒక్కరికి సొసైటీలో ఉన్న వనరుల మేరకు మాత రమాబాయి జీవిత చరిత్ర గ్రంధాలను ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు..ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు బండి సుధాకర్,ప్రజా సంఘాల నాయకులు పీక కిరణ్, అక్కల బాపు యాదవ్, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు కేశారపు నరేశ్,ఇందారపు ప్రభాకర్, మాజీ జెడ్పిటిసి కొండ రాజమ్మ, బోడ బాపు, కత్తెరమల్ల శ్రీనివాస్, లింగమల్ల రంజిత్,తదితరులు పాల్గొన్నారు.