ఇంటర్నేషనల్‌ డిస్టిక్‌ ఇసామి గ్యాట్‌ అవార్డు పొందిన రామచంద్రయ్య

నవతెలంగాణ-తిరుమలగిరి
నిస్వార్థ సేవ, నిరాడంబరమైన జీవితం, నిరుపేదలకు అండగా నిలిచి అక్షర రూపం దాల్చిన ఒక సిరా చుక్కై లక్ష మెదళ్లకు కదలిక గా మారి మందలో ఒక్కడు కాకుండా వందలో ఒక్కడుగా 2022- 2023 ఏడాది పాటు లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడిగా ఎన్నో స్వచ్ఛంద సేవలు అందించి అందరి మన్ననలు పొంది శభాష్‌ అనిపించుకున్న జలగం రామచంద్రయ్యకు ఆదివారం లయన్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ డిస్టిక్‌ 320ఎఫ్‌ ఇసామి గ్యాట్‌ అవార్డు హైదరాబాదు కొంపెల్లి కన్వెన్షన్‌లో ఆయన చేసిన సేవలను గుర్తించి పీఐడీ సునీల్‌కుమార్‌ ఇంటర్నేషనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఘట్టమనేని బాబురావు చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ ప్రస్తుత అధ్యక్షులు మంద పద్మారెడ్డి, కార్యదర్శి కందుకూరి లక్ష్మయ్య, కోశాధికారి డాక్టర్‌ సురేష్‌కుమార్‌, సభ్యులు లయన్‌ అయిత శ్రీనివాస్‌, కష్ణమాచారి, ఇమ్మడి వెంకటేశ్వర్లు, గణేష్‌, లక్ష్మణ్‌, సోమేష్‌, సుందర్‌, కాకి వెంకటరెడ్డి పాల్గొన్నారు.