
– పదోన్నతిపై వెళ్లిన హెచ్ఎంకు ఘనంగా సన్మానం
నవతెలంగాణ పెద్దవంగర:
సమాజంలో ఉత్తమ సేవలు అందించినప్పుడే ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని పాలకుర్తి దేవస్థానం మాజీ చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ, పెద్దవంగర జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బుదారపు శ్రీనివాస్ అన్నారు. గతంలో పాఠశాల హెచ్ఎంగా విధులు నిర్వహించి, ఇటీవల గెజిటెడ్ హెచ్ఎంగా పదోన్నతి పొంది, బదిలీ అయిన అర్రోజు విజయ్ కుమార్ ను మంగళవారం ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధి కోసం కష్టపడి పని చేసే ఉపాధ్యాయులకు సమాజంలో ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు. అలాంటి వారికి ప్రజల్లో గౌరవం, మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయని అన్నారు. విజయ్ కుమార్ పాఠశాలకు చిత్తశుద్ధితో సేవలందించారని తెలిపారు. మండలానికి దూరవిద్యా కేంద్రాన్ని తీసుకురావడానికి ప్రత్యేక చొరవ చూపారని చెప్పారు. ఆయన సేవలను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఉపాధ్యాయుడు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజలింగం, సదయ్య, టకీ పాషా, అంజయ్య, షౌకత్ అలీ, యాకయ్య, విజయ్ కుమార్, వెంకన్న, శ్రీనివాస్, సువర్ణ, హైమ, కరుణ, సీఆర్పీ లు రమాదేవి, రంగన్న తదితరులు పాల్గొన్నారు.