అర్చకరత్న నేషనల్ అవార్డుకు కోహెడ మండలం రాంచంద్రపూర్ గ్రామానికి శ్రీ సీతారామ ఆంజనేయ ఆలయ ఆర్చకులు శ్రీ రంగం రామాచారి ఎంపికయ్యారు. ఈ మేరకు అవార్డు నేషనల్ కమిటీ చైర్మన్ బీ ఎస్ ఏ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ బహుజన జాతీయ కార్యాలయం హైదరాబాద్ లో అవార్డు పత్రాన్ని అందజేశారు.ఈ సందర్బంగా అవార్డు గ్రహిత రామాచారి మాట్లాడుతూ శ్రీ సీతా రామచెంద్రస్వామి ఆలయం లో గత 38 సంవత్సరాలుగా అర్చకత్వము చేస్తూ గ్రామ ప్రజల భక్తుల సహకారం తో ఆలయ అభివృద్ధి కి తోడ్పడుతూ శ్రీ రాముని సేవే పరమావధి గా భావిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. గతంలో 20 సంవత్సరాలు ప్రైవేటు పాఠశాల నెలకొల్పి విద్యార్థులకు విద్యను అందించారు. గోదావరి పుష్కరాల సమయంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ ద్వారా ప్రశంసా పత్రం పొందినారు. ఈ అవార్డు రా మచెంద్రాపురం గ్రామ ప్రజలకు రామ భక్తులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.