ఘనంగా రంజాన్ పండుగ

నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ  గ్రామాలలో గురువారం  రోజున రంజాన్ పర్వదిన వేడుకలను ముస్లిం సోదరులు  ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు నూతన బట్టలు ధరించి ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు  నమాజ్ చేసి అల్లను  గుర్తు చేస్తు అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అల్లాను వేడుకున్నారు. నమాజ్ అనంతరం ముస్లిం సోదరులు ఈద్గాల  వద్ద మరియు గ్రామాలలో ఒకరినొకరు అలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కాటేపల్లి గ్రామంలో ముస్లిం సోదరులు మల్లప్ప పటేల్ ను ఆలింగనం చేసుకుంటూ శాలువాతో సన్మానించారు. రంజాన్ వేడుకలకు పలువురిని పిలిచి   ఇంటి వద్ద విందు ఏర్పాటు చేశారు .ఈ కార్యక్రమంలో ముస్లిం మాత నాయకులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.