మతసామరస్యానికి ప్రతీక రంజాన్‌

Ramadan is a symbol of religious harmonyనవతెలంగాణ-పరిగి
మతసామరస్యానికి ప్రతీక రంజాన్‌ పండుగ అని ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం పరిగి పట్టణ కేంద్రంలోని టీఆర్‌ఆర్‌ నివాసంలో ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశారు. ఈ ఇఫ్తార్‌ విందులో చేవెళ్ల పార్లమెంట్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి ఎంపీ రంజిత్‌రెడ్డి, మస్కట్‌ డైరీ యజమాని అలీబిన్‌ ఇబ్రహీం మస్కటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లిం సోదరులకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్‌ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైందని అన్నారు. అందరూ శాంతియుతంగా పండుగను జరుపుకోవాలని సూచించారు. ముస్లింల అభివద్ధి కొరకు ప్రభుత్వం ఎంతో కషి చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో ముస్లిం సోదరులు, కాంగ్రెస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.