మతసామరస్యానికి ప్రతీక రంజాన్‌

– బీసీ ఐక్య వేదిక శేరిలింగంపల్లి అధ్యక్షులు బండారి రమేష్‌ యాదవ్‌
– రాచమళ్ళ ప్రకాష్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో రంజాన్‌ విందు
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
మతసామరస్యానికి ప్రతీక రంజాన్‌ పండుగ అని బీసీ ఐక్య వేదిక శేరిలింగంపల్లి అధ్యక్షులు బండారి రమేష్‌ యాదవ్‌ అన్నారు. రంజాన్‌ పండుగ సందర్భంగా మి యాపూర్‌ సీనియర్‌ నాయకుడు వజీర్‌ తన నివాసంలో రంజాన్‌ పండుగ సందర్భంగా విందు ఏర్పాటు చేసి ప్రజ లందరికీ రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. బీసీ ఐక్య వేదిక శేరిలింగంపల్లి అధ్యక్షులు బండారి రమేష్‌ యాదవ్‌ అడ్వకేట్‌ మాట్లాడుతూ..ముస్లింలు నెల రోజులు ఉప వాసం చేస్తూ, పవిత్ర గ్రంథమైన ఖురాన్‌ను పఠిస్తూ, జకాత్‌, ఫితర్‌అనే దాన ధర్మాలు చేస్తూ అత్యంత భక్తి శ్రద్ధ లతో కఠిన నియమాలతో నిర్వహించుకునే పవిత్రమైన పండుగ ఈ రంజాన్‌ అని అన్నారు. ఆ అల్లామాలిక్‌ కరు ణతో ముస్లిం సోదరులందరూ ఆయురారోగ్యాలతో బత కాలని కోరారు. ఇక భారతదేశంలో హిందువులు ముస్లిం లు కలిసిమెలిసి, ముస్లింల పిలుపు మేరకు ఇఫ్తార్‌ విందు లో పాల్గొంటూ రంజాన్‌ పండుగను అనందంగా జరుపు కోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ ఐక్యవే దిక శేరిలింగంపల్లి ఉపాధ్యక్షులు నర్సింగ్‌ ముదిరాజ్‌, దీప్తిశ్రీనగర్‌ స్పోర్ట్స్‌ అకాడమీ సభ్యులు శ్రీనివాస్‌, రామారావ్‌, విశ్వాస్‌, సురేష్‌, లక్ష్మారెడ్డిలు ముస్లింలందరికి ఈద్‌ ముబారక్‌ తెలిపారు.