పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా డిసిసి ఉపాధ్యక్షురాలిగా రామగిరి లావణ్య నియమితులు అయ్యారు. పెద్దపెల్లి జిల్లా రామగిరి మండలం ముస్త్యాల గ్రామ మహిళ తాజా మాజీ సర్పంచ్ రామగిరి లావణ్య-నాగరాజు జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళ ఉపాధ్యక్షురాలుగా, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా మహిళా అధ్యక్షురాలు కొలిపాక సుజాత రామగిరి లావణ్యను ఉపాధ్యక్షురాలిగా నియమించగా, శనివారం గాంధీభవన్ లో ఐటి శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా రామగిరి లావణ్య మాట్లాడుతూ.. ఇన్ని రోజులు ప్రజాసేవలో ఉన్న తన సేవలు గుర్తించిన కాంగ్రెస్ పెద్దలు ఈ కీలక బాధ్యతను అప్పగించినందుకు తన వంతు బాధ్యతను నియమ నిబద్దతతో నిర్వహిస్తానని తెలిపారు. తనపై నమ్మకంతో జిల్లా ఉపాధ్యక్షురాలుగా నియమించిన ఐటి శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు,పెద్దపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే విజయ రమణా రావుకు, రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాకూర్ కు, పెద్దపల్లి డిసిసి జిల్లా మహిళా ప్రెసిడెంట్ కొలిపాక సుజాతకు కృతజ్ఞతాభివందనాలు తెలియజేశారు.