మున్సిపల్ కమిషనర్ గా రామకృష్ణ

నవతెలంగాణ – భీంగల్
భీంగల్ మున్సిపల్ కమిషనర్ గా రామకృష్ణ గురువారం బాధ్యతలు చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ గా పనిచేసిన గోపు గంగాధర్ బదిలీపై వెళ్లగా అప్పటినుండి ఇంచార్జ్ కమిషనర్  గా రాజేందర్ విధులు నిర్వహించారు. ఇటీవల నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం చేపట్టిన బదిలీలలో వరంగల్ మెప్మా  అధికారి రామకృష్ణను భీంగల్ మున్సిపల్ కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో గురువారం బాధ్యతలు చేపట్టారు.