
ఆమనగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, సీనియర్ జర్నలిస్టు ఇటికాల రమణారెడ్డి, ఉపాధ్యక్షులు మస్న ఆనంద్ శుక్రవారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని కలిశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపినట్టు వారు తెలిపారు. ఈసందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టు వారు తెలిపారు.