తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సందీప్ కుమార్ సుల్తానియా(ఐఏఎస్) ఆదేశాల మేరకు కామర్స్ విభాగాధిపతి గా ప్రొఫెసర్ డాక్టర్ రాంబాబు గోపిశెట్టి నీ నియమించినట్టు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదిగిరి బుధవారం నియామక పత్రాన్ని అందజేశారు. ప్రస్తుతం ప్రొఫెసర్ రాంబాబు కామర్స్ విభాగానికి డిన్ గా వ్యవరిస్తున్నారు రాంబాబు గతంలో తెలంగాణ యూనివర్సిటీ లో అకాడమిక్, మరియు అడ్మినిస్ట్రేషన్ పదవులను సమర్థంగా నిర్వహించి గతంలో ఆడిట్ సెల్ జైంట్ డైరెక్టర్ గా, అసిస్టెంట్ కంట్రోలర్ కాన్ఫిడెన్స్, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ గా, హాస్టల్ నోడల్ అధికారి అలుమిని అసోసియేషన్,స్పోర్ట్స్ డైరెక్టర్ గా ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం అధికారిగా వ్యవరించారు. అకాడమీ పరంగా రెండు దపాలుగా హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ మీటింగ్ చైర్మన్ గా పాఠ్య ప్రణాళిక సంఘానికి వ్యవహరించారు. యూనివర్సిటీలో 15 పైగా సెమినార్లు నిర్వహించి, 12 మంది విద్యార్థులకు పి హెచ్ డి పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ డాక్టర్ రాంబాబు, వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ లకు ధన్యవాదాలు తెలుపుతూ నాపై నమ్మకా ముంచి ఈ పదవి బాధ్యతను ఇచ్చినందుకు దీనిని సమర్థంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు.