నవతెలంగాణ-శేరిలింగంపల్లి
శేరిలింగంపల్లి డివిజన్‌లోని తారానగర్‌లోని ప్రభు త్వ మండల ప్రాథమిక పాఠశాల స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మెన్‌గా 12 ఏండ్లు బాధ్యతలు చేపట్టిన రాంచం దర్‌కు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో శేరిలింగం పల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్యఅతిథు లుగా హాజరై ఎస్‌ఎంసీ రాంచందర్‌ను పూలమాల వేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ..12 ఏండ్లుగా రాంచందర్ స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీ చైర్మెన్‌గా బాధ్యతలు నిర్వహించి పాఠశాల అభివృద్ధికి కృషి చేశారన్నారు. పాఠశాలలోని పలు సమ స్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకురాగా పాఠశాల అభి వృద్ధికి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వరిత గతిన పనులు పూర్తి అయ్యేలా శక్తివంచనా లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతీ ఒక్క విద్యార్థి ఉన్నతమైన చదువులు చదివి భవిష్యత్తులో ఉన్నతమైన స్థాయికి ఎద గాలని ఆకాంక్షిచారు. అనంతరం లయన్స్ క్లబ్ వారు ఏ ర్పాటు చేసిన చీరలను శానిటేషన్ డిపార్ట్‌మెంట్ మహిళ లకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డివిజన్ గౌరవ అ ధ్యక్షులు వీరేశం గౌడ్, వార్డ్ మెంబర్ కవిత, లయన్స్ క్లబ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ లక్ష్మరెడ్డి, కాంగ్రెస్ ప్రధాన కార్య దర్శి సునీతా ప్రభాకర్ రెడ్డి, స్కూల్ హెడ్ మాస్టర్ నాగ య్య, పవన్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, గాయత్రి, పాం డు, లక్ష్మినారాయణ గౌడ్, ప్రభాకర్ రెడ్డి, ఉపాధ్యాయులు, రోటరీ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.