రామ్‌చరణ్‌ కథ ఏంటని అడిగారు

Ram Charan He asked what the story was‘కలర్‌ ఫోటో’, ‘తెల్లవారితే గురువారం’ చిత్రాల తర్వాత లౌక్య ఎంటర్‌ టైన్‌మెంట్స్‌ పతాకంపై రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించిన సినిమా ‘బెదురులంకహొ2012’. కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటించారు. క్లాక్స్‌ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి సి. యువరాజ్‌ సమర్పకులు.
ఈ శుక్రవారం సినిమా విడుదలవు తోంది. ఈ సందర్భంగా నిర్మాత బెన్నీ మీడియాతో మాట్లాడుతూ, ‘కథలో ‘ఫియర్‌’ (భయం) కూడా ఓ పాత్ర పోషిస్తుంది. అందుకే బెదురు లంక అని టైటిల్‌లో పెట్టాం. ఓ ఊహాజనిత గ్రామంలో 2012లో 21 రోజులు ఏం జరిగింది? అనేది కథ. క్లాక్స్‌ చెప్పిన కథ చాలా బాగుంది. హీరో కార్తికేయ ఇందులో తనకు నచ్చినట్టు జీవించే పాత్రలో కనిపిస్తారు. అతడ్ని సమాజం ప్రశ్నిస్తూ ఉంటుంది.
హీరో ప్రేయసి పాత్రలో నేహా శెట్టి కనిపిస్తారు. మన మనసుకు నచ్చినట్లు 100 పర్సెంట్‌ బయటకు బతకం, చనిపోతాం అని తెలిస్తే చివరి క్షణాల్లో ఎలా ఉంటాం? అనేది సినిమా కోర్‌ పాయింట్‌. డ్రామా, కామెడీ సినిమాలో హైలెట్‌ అవుతాయి. ‘సిరివెన్నెల’తో ఓ పాట రాయించాం. ఆయన ఈ పాట రాస్తున్న సమయంలోనేహొశివైక్యం చెందారు. మిగతా పాటను చైతన్య ప్రసాద్‌ రాశారు. ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేయడానికిహొముందు హీరో రామ్‌చరణ్‌ కథ ఏంటని అడిగి తెలుసుకున్నారు. ట్రైలర్‌ చూసిన తర్వాత కాన్సెప్ట్‌ గురించి మాట్లాడారు. ప్రస్తుతం మూడు ప్రాజెక్ట్స్‌ ఓకే చేశాం. వాటిల్లో రెండు కాన్సెప్ట్‌ ఓరియెంటెడ్‌ ఫిలిమ్స్‌. మరొకటి భారీ సినిమా. ఈ సినిమా రిలీజ్‌ తర్వాత వీటి వివరాలు చెబుతాను.