మాదిగ జెఎసి పట్టణ అధ్యక్షులుగా రమేష్ నియామకం..

నవతెలంగాణ – మునుగోడు:  మునుగోడు మండల పరిధిలోని లక్ష్మీదేవిగుడానికి చెందన జీడిమడ్ల రమేష్ ను గురువారం తెలంగాణ మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పిరుమర్తి రవి ఆదేశాల మేరకు మునుగోడు నియోజకవర్గ మాదిగ జేఏసీ  ఇన్చార్జి మేడిచంద్రస్వామి ఆధ్వర్యంలో  మునుగోడు పట్టణ అధ్యక్షులుగా  నియామక పత్రాన్ని అందజేశారు. తన నియమాహానికి సహకరించిన మాదిగ జేఏసీ  నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.సంఘం బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్గ జేఏసీ జిల్లా కార్యదర్శి దండు పరుశురాం పందుల సురేష్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.