విద్యార్ది దశ నుండే సీసీఐ(ఎం) బాటలో రమేష్ బాబు 

Ramesh Babu has been on the path of CCI(M) since he was a studentనవతెలంగాణ – కంఠేశ్వర్ 
సీసీఐ(ఎం) జిల్లా కార్యదర్శిగా ఏ రమేష్ బాబును ఈనెల 26, 27న జరిగిన జిల్లా పార్టీ మహాసభలో ఎన్నుకోవడం జరిగింది. 1990 నుండి విద్యార్థి సంఘంలో చేరి నమ్మకంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడిగా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా, పనిచేయడంతో పాటు సుదీర్ఘకాలం 1998 నుండి 15 సంవత్సరాలకు పైగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా, సీసీఐ(ఎం) నగర కార్యదర్శిగా పనిచేయడం జరిగిందని 17లో జరిగిన 21వ మహాసభలో పార్టీ జిల్లా కార్యదర్శిగా ఎన్నికై ఆ అప్పటినుండి 2022 జనవరిలో జరిగిన 22వ మహాసభలో రెండోసారి జిల్లా కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగిందని, అదేవిధంగా ఈనెల 26 ,27న జరిగిన 23వ  జిల్లా మహాసభలో మూడోసారి ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. విద్యార్థి దశ నుండే పుస్తకాల కొరతకు వ్యతిరేకంగా, హాస్టల్ విద్యార్థుల సమస్యల పైన, మిస్ చార్జీలు కాస్మోటిక్ చార్జీలు పెంచాలని ఫీజు రియంబర్స్మెంట్ ను కల్పించాలని జరిగిన అనేక ఉద్యమాల్లో ముందుండి నడపడం జరిగింది. అనంతరం కార్మిక నాయకుడిగా స్కీం వర్కర్ల సమస్యలతో పాటు నిజాం షుగర్ ఫ్యాక్టరీ  కార్మికు అధ్యక్షుడిగా, సుజిత్ ఫ్యాక్టరీ ఇక సంఘానికి అధ్యక్షుడిగా, ఇతర అనేక కార్మికుల నాయకత్వం వహించి వారి వేతనాల సమస్యల పైన సౌకర్యాల పెంపుదల కొరకు ఉద్యమాలు నిర్వహించటం జరిగిందని, పార్టీ జిల్లా కార్యదర్శిగా పేద ప్రజలకు ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని పోరాటాలు నిర్వహించటంతో పాటు జిల్లాలో అనేక కేంద్రాల్లో భూపోరాటాల్లో పాల్గొని పేదల చేత గుడిసెలు వేయించటం జరిగిందని, ప్రజా సమస్యలపైన నిరంతరం పోరాడే మనస్తత్వం ఉండటం వల్లనే పార్టీ కార్యకర్తలు మూడవసారి జిల్లా కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. ఉద్యమాల సందర్భంగా అనేక మార్లు కేసులు ఎదుర్కొని  ఏ మాత్రం ప్రభుత్వ అణిచివేతకు వెనక్కి తగ్గకుండా ఉద్యమాల్లో మరింత చురుకుగా, పట్టుదలగా, పాల్గొనటమే ఈ అవకాశాలకు కారణమని, అతి సాధారణ పేద కుటుంబంలో అడవుల లక్ష్మికి జన్మించిన తాను చిన్నతనంలో తండ్రి చనిపోయినా.. తల్లి కూలీ పని చేసుకుని తమను పోషించటం జరిగిందని అన్నారు.  అందువల్ల కష్టాలను అనుభవించటంతో పాటు, కష్టాలకు కారకులైన వారిని ఎదిరించినప్పుడే మేలు జరుగుతుందని, పార్టీ, సుందరయ్య లాంటి వారి త్యాగాన్ని కేనం చేసి పార్టీవైపు ఆకర్షితులవటం జరిగిందని  తెలిపారు. ఐదు సంవత్సరాలుగా పార్టీ ఉద్యమాల్లో ప్రజా జీవితంలో ఎటువంటి మచ్చ లేకుండా కొనసాగటం వల్లనే తనకు ఈ బాధ్యతలు అప్పగించటం జరిగిందని తెలిపారు. పార్టీ అప్పగించిన ఈ బాధ్యతల్లో శక్తి మేరకు ఉద్యమ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.