
రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో నిధులను కేటాయించటంలో వివక్షత పాటించిందని ప్రధానంగా వితంతువులకు, వికలాంగులకు వృద్ధులకు ఉంచుతామన్న పెన్షన్కు కేటాయింపులు జరగలేదు. అదేవిధంగా మహిళలకు నెలకు రూ.2500 అందజేస్తామని చెప్పిన హామీకి కౌలు రైతులకు ఇస్తామన్నా హామీని అమలు జరపటంలో ప్రభుత్వం విఫలమైందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు అన్నారు. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులకు ఉద్యోగులకు వేతనాలను పెంచటానికి గాని లేదా ఉపాధి అవకాశాలను కల్పించడానికి ఈ బడ్జెట్లో ఏ రకమైన నిధులు లేవని అదేవిధంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పిన హామీ అమలు జరపటం హర్షించదగ్గ పరిణామం అని, అదేవిధంగా కోపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ని కూడా తెరిపించాలని అందుకు తగిన నిధులను కేటాయించాలని జిల్లాలో పసుపు శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేయటానికి నిధులను కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.