
నవతెలంగాణ – కంటేశ్వర్
రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ ని వర్తింపజేయాలని, రైతు రుణమాఫీ కొరకు ఇచ్చిన మార్గదర్శకంలో అనేక నిబంధనల మూలంగా అర్హులైన పేద మధ్యతరగతి రైతులు రుణమాఫీకి దూరమయ్యే పరిస్థితులు ఉన్నాయని వాటిని సవరించాలని ఈ ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం చేస్తున్న నిబంధనలో సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల దగ్గర గాని , రైతు మిత్ర గ్రూపుల వద్ద లేదా ఇతర సంస్థలతో తీసుకున్న రుణాలను చెల్లించేది లేదన్నట్టుగా నిబంధన ఉందని దీని మూలంగా పేద మధ్యతరగతి రైతులు ప్రధానంగా దళిత అట్టడుగు వర్గాల రైతాంగం పోయే ప్రమాదం ఉందని దీన్ని సవరించాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా రెండు లక్షల పైన అప్పులు ఉన్న రైతులు ముందు వాటిని చెల్లించిన తర్వాత రైతు రుణమాఫీ జరుగుతుందని తెలపటం మూలంగా రైతుల నష్టపోయే ప్రమాదం ఉందని ఇప్పటికే వర్ష భావ పరిస్థితుల వలన గతంలో పంటలు పండక అప్పుల పాలైన రైతులు ఇప్పుడు వర్షాకాలం పంటలకు పెట్టుబడి పెట్టి ఇబ్బందులు పడుతున్న రైతాంగం ముందు బ్యాంకులో ఉన్నప్పుడు తీర్చాలంటే సాధ్యమయ్యే పని కాదన్నారు. అందువల్ల ముందుగా ప్రభుత్వం రెండు లక్షల రుణాన్ని పంటలు వచ్చిన తర్వాత డబ్బులను రైతులు చెల్లించేటట్టు ఆదేశాలు ఇవ్వాలని ఆయన అన్నారు అదేవిధంగా కే అనేకమంది ప్రజలు ప్రజా పాలన కార్యక్రమంలో పాసుబుక్కుల కొరకు, రేషన్ కార్డుల కొరకు దరఖాస్తులు పెట్టుకున్నప్పటికీ వారికి అవి అందలేదని అందువల్ల రుణమాఫీ కి వాటిని ఉంచాలని నిబంధన పెట్టటం సరైనది కాదని వాటిని సవరించాలని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులందరి పంట రుణాలను మాఫీ చేసేటట్టు అందరికీ రుణమాఫీ వర్తించేటట్టు నిబంధనలను విడుదల చేసి జి వో ఇచ్చినప్పుడు మాత్రమే రైతులు సంతృప్తి చెందుతారని ఆయన అన్నారు.