
మండల కేంద్రానికి చెందిన కమాన్‌పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుడు జాలిగాం రమేష్‌కు శుక్రవారం కాకతీయ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఎస్. నరసింహాచారి డాక్టరేట్ ప్రకటించారు. తెలంగాణలోని పాక్షిక శుష్క మండలాల్లో నీటిపారుదల, యాంత్రీకరణ, వ్యవసాయ వృద్ధి అనే అంశంపై రిటైర్డ్ ప్రొఫెసర్ ఎన్. విజయ పర్యవేక్షణలో పరిశోధనను పూర్తి చేశారు. ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాల కమాన్‌పూర్‌లో జూనియర్ లెక్చరర్‌గా సేవలందిస్తున్నారు. రానున్న రోజులలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కళాశాల ప్రిన్సిపాల్ కె.సుధాకర్, అధ్యాపకులు, గ్రామస్థులు, పలువురు అభినందించారు.