నవతెలంగాణ – దుబ్బాక
దుబ్బాక నుంచి కామారెడ్డి మున్సిపాలిటీకి బదిలీపై వెళ్తున్న కమిషనర్ కల్యాణం రమేష్ కుమార్ ను తాజా మాజీ పాలకవర్గ సభ్యులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఏడాది కాలంలో కమిషనర్ గా రమేష్ కుమార్ చేసిన సేవల పట్ల అభినందనీయమన్నారు.తాజా మాజీ కౌన్సిలర్లు ఆస యాదగిరి,ఇల్లందుల శ్రీనివాస్, బత్తుల స్వామి, దివిటి కనకయ్య, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గన్నె భూమిరెడ్డి, గోనెపల్లి సంజీవరెడ్డి, అధికం బాలకిషన్ గౌడ్, పల్లె రామస్వామి గౌడ్, పలువురున్నారు.