కాంగ్రెస్ పార్టీ ఇచ్చే వాగ్దానాలు అన్నింటిని నెరవేరుస్తుంది: రమేష్ రెడ్డి

నవతెలంగాణ – సూర్యాపేట
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలన్నిటిని నెరవేర్చుతుందని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ పర్యటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని పలు వార్డుల్లో జరిగిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో 17  ఎంపీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని జోస్యం చెప్పారు. ఇచ్చిన 6 గ్యారంటీలో ఇప్పటివరకు ఐదు గ్యారెంటీలను అమలు చేసిందన్నారు. మహిళలు ఎక్కడికి పోవాలన్నా ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందని, అలాగే 500 రూపాయలకే గ్యాస్ ఇస్తుందని, పది లక్షల ఆరోగ్యశ్రీ ని అందిస్తుందని, 200 యూనిట్ల ఉచిత కరెంటు ని అందించి ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని వివరించారు. మే 13న జరిగే ఎంపీ ఎలక్షన్ లో నల్గొండ యంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు. అలాగే ఎంపీ ఎలక్షన్ ముగిసిన తర్వాత మహిళలు ఎదురుచూస్తున్న మహాలక్ష్మి పథకం కింద 2500 అర్హులైన ప్రతి మహిళకు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు ఊర రామ్మూర్తి,  19 వ వార్డు మాజీ కౌన్సిలర్ నిమ్మల వెంకన్న,జ్యోతి కరుణాకర్, భాస్కర్ నాయక్, వాసవి శెట్టి వెంకన్న, తండా రమేష్, భోపాని శ్రీకాంత్, ఉపేందర్, మహమ్మద్, ఎర్ర పృథ్వి రెడ్డి, గుండుమల్ల రాజేష్, జమీల్ తదితరులు పాల్గొన్నారు.