తెలంగాణ రాష్ట్ర ఐటి పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీదర్ బాబు సీఎం రేవంత్ రెడ్డితోపాటు దావోస్ సింగపూర్ పర్యటన విజయవంతంగా ముగించుకుని రూ. 1.79 లక్షల కోట్లు పెట్టుబడులు సాధించుకు తీసుకు వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి జిల్లా ఎస్సిసెల్ అధ్యక్షుడు దండు రమేష్ బుధవారం మినిస్టర్ క్వాటర్స్ హైదరాబాద్ లో శాలువాతో సన్మానించి, అభినందనలు తెలిపారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ ఎడ్లపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు జంగిడి సమ్మయ్య ఉన్నారు.