నవతెలంగాణ-హలియా : కొత్తలూరు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మండల పార్టీ ఉపాధ్యక్షులు కొట్టే రమేష్ యాదవ్ 200 మంది కార్యకర్తలతో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. 2018 సాధారణ ఎన్నికల్లో నోముల నరసింహయ్య గెలుపు కోసం కృషి చేశారు. తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో నోముల భగత్ గెలుపుకోరుతు కొత్తలూరు నుండి లింగంపల్లి శ్రీ పెద్దమ్మ తల్లి దేవస్థానం వరకు 200 మంది కార్యకర్తలతో పాదయాత్ర చేసి బిఆర్ఎస్ పార్టీకి కృషి చేసినట్లు తెలిపారు. అదేవిధంగా ఉప ఎన్నికల్లో నోముల భగత్ గెలుపు కోసం కృషి చేసినా బిఆర్ఎస్ పార్టీలో తగిన ప్రాధాన్యత లేదని పార్టీ కి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ పథకాలకు ఆకర్షితుడై పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.