నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
పందిల్ల గ్రామానికి సర్పంచ్ గా తోడేటి రమేష్ ఐదు సంవత్సరాల కాలంలో చేసిన సేవలు అభినందనీయమని మిత్ర బృందం కొనియాడారు. ఆదివారం హైదరాబాద్ మిత్ర బృందం ఆధ్వర్యంలో సర్పంచ్ తోడేటి రమేష్ కు పదవి విరమణ సన్మాన సభ ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వెలుదండి రమేష్, నూతి రాజేంద్రప్రసాద్ ,తాటికొండ రాజశేఖర్ రెడ్డి, ఉప్పరపల్లి రమేష్ ,వెలుదండి సంతు ,బొద్దుల శ్రీనివాస్, నూతి శ్రీనివాస్ ,నూతి పరశురాములు, అక్కిపెల్లి శ్రీనివాస్ ,సుదగోని శంకర్, వెలుదండి అజయ్ ,పంతంగి సతీష్ ,గూల్ల సతీష్, పోలవేణి మహేష్ తదితరులు పాల్గొన్నారు.