– పేలుడు తర్వాత 8 రోజులకు
బెంగళూరు : బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ రీ ఓపెన్ అయ్యింది. పేలుడు జరిగిన తర్వాత 8 రోజులకు కేఫ్ తెరుచుంది. ఈ కేసుని ఎన్‌ఐఏకు అప్పగించిన తర్వాత.. కేఫ్‌లో దెబ్బతిన్న భాగాలకు మరమ్మతులు చేసి ప్రారంభించినట్లు కేఫ్ హెచ్‌ఆర్ హెడ్ తెలిపారు.పేలుడు తర్వాత మరింత బలంగా, ప్రకాశవంతంగా తిరిగి తెరుస్తున్నాం అని ఆయన అన్నారు. మరోవైపు కేఫ్ దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు అధికారులు. కేఫ్‌కు వచ్చే అందర్నీ తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. మెటల్ డిటెక్టర్లనూ కూడా ఏర్పాటు చేశారు. రామేశ్వరం కేఫ్‌లో మార్చి 1వ తేదీన మధ్యాహ్నం పేలుడు జరిగింది. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. కాగా.. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. బాంబ్ బ్లాస్ట్ కు కారణమైన వ్యక్తి ఫొటోను రిలీజ్ చేశారు అధికారులు. నిందితుడి ఆచూకీ తెలిసిన వారికి రూ.10 లక్షలు ఇస్తామని ప్రకటించారు.
రామేశ్వరం పేలుడు ఘటన అనుమానితుని ఫొటోలను రిలీజ్ చేసిన ఎన్‌ఐఎ
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో మార్చి 1వ తేదీన మధ్యాహ్నం బాంబ్ బ్లాస్ట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ కేఫ్‌లో సిసిటివి ఫుటేజ్ ఆధారంగా అనుమానితుడు ముఖానికి మాస్క్ ధరించి, తలకు టోపీ పెట్టుకుని బస్సు నుంచి దిగి కేఫ్‌లోకి వచ్చాడని పోలీసులు తెలిపారు. తాజాగా ఈ ఘటనకు పాల్పడిన అనుమానితుడు ఫొటోలను ఎన్‌ఐఎ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) కొత్త ఫొటోలను రిలీజ్ చేసింది. తాజాగా ఎన్‌ఐఎ విడుదల చేసిన ఫొటోల్లో నిందితుడు పింక్ కలర్ టీ షర్ట్ ధరించి ముఖానికి మాస్క్ ధరించి, భుజానికి బ్యాగ్ తగిలించుకుని నడుస్తున్నట్టుగా ఉంది.