సమాజం పట్ల ముందు చూపు ఉన్న వ్యక్తి రామోజీరావు

సమాజం పట్ల ముందు చూపు ఉన్న వ్యక్తి రామోజీరావు– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు
నవతెలంగాణ-మియాపూర్‌
సమాజం పట్ల ముందు చూపున గొప్ప వ్యక్తి రామో జీరావు అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. శనివారం మాదాపూర్‌ డివిజన్‌ ప్రజలంద రికీ సిఆర్‌ ఫౌండేషన్‌లో ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సం స్కరణ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రామో జీరావు విశ్వసనీయత, గొప్పదనం అందరికీ తెలుసునని, ప్రతి సందర్భంలోనూ ఆయన ప్రజల పక్షాన నిలబడ్డా రని, ఆనాడు రామోజీరావు వామపక్ష భావజాలంతో వ్యవ స్థలు, సంస్థల్లో పని చేశారని తెలిపారు. వారే నిక్కచ్చి కమ్యూనిస్టులు అని కొనియాడారు. 1983లో పుచ్చల పల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వర రావుతో కొన్ని రాజకీ య చర్చల సమయంలో ‘మీకంటే నేనే ఎక్కువ కమ్యూని స్టునని’ రామోజీరావు అనే వారని మంత్రి తుమ్మల గుర్తు చేశారు. రామోజీరావు సహా వీరంతా ఏనాడు ప్రభుత్వం, పాలకపక్షాల తరపున నిలబడ్డ వ్యక్తులు కాదని, వారు నిల బడింది ప్రజల పక్షానేనని తెలిపారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా,. రాజకీయ కష్టం లేదా ప్రకతి వైపరిత్యా లు, పా లనపరమైన ఇబ్బందులొచ్చినా ప్రజల పక్షాన మాత్రమే రామోజీ నిలబడ్డారని తుమ్మల నాగేశ్వరరావు కొనియాడా రు. విలువలతో కూడిన వ్యవస్థలు..సంస్థల ను నిర్మించిన ఘనట రామోజీరావుకే దక్కింది: సురవరం సుధాకర్‌ రెడ్డి సురవరం సుధాకర్‌ రెడ్డి అధ్యక్షోపన్యాసం చేస్తూ దేశంలో ప్రత్యేకించి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వార్తా ప్ర పంచం, తెలుగు భాష కోసం రామోజీరావు ఎనలేని కృషి చేశారన్నారు. విలువలతో కూడిన వ్యవస్థలు, సంస్థలు నిర్మించిన ఘనత రామోజీరావుకే దక్కిందని ఆయన ప్ర శంసించారు. తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధా న కార్యదర్శి పల్లె నర్సింహా రామోజీ రావు పైన స్వయం గా రాసిన పాడిన పాట సభికులను ఆకట్టుకున్నది.