విశిష్ట గుణాల మేలు కలయిక రామోజీరావు

– ఎడిటర్‌ ఎం. నాగేశ్వరరావు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
విశిష్ట గుణాల మేలు కలయిక ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావు అని ఈనాడు ఏపీ ఎడిటర్‌ ఎం.నాగేశ్వరరావు చెప్పారు. తెలుగువారికి ఎనలేని ఖ్యాతి తెచ్చారని కొనియాడారు. ఆయన జీవితం నుంచి నేర్చుకోవాల్సినవి ఎన్నో అంశాలున్నాయని వివరించారు. ఆదివారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఈనాడు ఉద్యోగుల ఆధ్వర్యంలో రామోజీరావు వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఈనాడు తెలంగాణ సంపాదకులు డీఎన్‌ ప్రసాద్‌, తెలంగాణ ప్రెస్‌ అకాడమీ చైర్మెన్‌ కె. శ్రీనివాస్‌ రెడ్డి, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు, సీనియర్‌ జర్నలిస్ట్‌ కె. రామచంద్రమూర్తి, నమస్తే తెలంగాణ సంపాదకులు కృష్ణమూర్తి, తెలంగాణ ప్రెస్‌ అకాడమీ మాజీ అధ్యక్షులు అల్లం నారాయణ, ప్రముఖ కార్టూనిస్ట్‌ శ్రీధర్‌ తదితరులు మాట్లాడారు.