నవతెలంగాణ – తంగళ్ళపల్లి
అంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా రాములోరి కళ్యాణం ఘనంగా జరిగింది. బుధవారం శ్రీరామనవమి సందర్భంగా తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాల్లో సీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తంగళ్ళపల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని పద్మనగర్, జిల్లెల్ల, సారంపల్లి, చీర్లవంచ, మండేపల్లి, కట్కూర్ తదితర గ్రామాల్లో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ నిర్వహకులు ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవాలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ఓడిబియ్యం, పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం పూట హోమాలు, యజ్ఞాలు నిర్వహించారు. కళ్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలను సమర్పించారు.కళ్యాణ మహోత్సవం అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.