ప్రధాని మోడీకి నల్ల జెండాలతో స్వాగతం : రాములు నాయక్‌

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రానికి రానున్న ప్రధాని మోడీకి నల్ల జెండాలతో స్వాగతం పలుకుతామని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ అన్నారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ నేత, ఎమ్మెల్యే శుక్లా అను చరుడు ఓ గిరిజనుడిపై మూత్ర విసర్జన చేసినా పట్టించు కోలేదని విమర్శించారు.
గవర్నర్‌ను కలిసి వినతిపత్రాలు ఇస్తామన్నారు. బీజేపీ అధ్యక్షులు జి. కిషన్‌రెడ్డి ఈ అంశంపై కేంద్రానికి లేఖ రాయాలని కోరారు. బీజేపీ నాయకులను మా తాండల్లోకి రానివ్వబోమని ఆయన హెచ్చరించారు.
అమరవీరుల గుర్తింపు కోసం కమిటీ వేయండి
రేవంత్‌రెడ్డికి రాముల్‌నాయక్‌ వినతి
తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణాలు ఆర్పించిన అమరవీరులను గుర్తించేందుకు టీపీసీసీ కమిటీ వేయాలని మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్‌ కోరారు. ఈమేరకు బుధవారం హైదరాబాద్‌లోని రేవంత్‌ నివాసంలో కలిసి ఆయన వినతిపత్రం సమర్పించారు. ఆ కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందంటూ వివిధ సందర్భాల్లో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే అమరవీరుల కుటుంబాలకు రూ 25వేల పెన్షన్‌ ఇస్తామని హామీ ఇచ్చిందనీ, అంందుకు అర్హులను గుర్తించాలని కోరారు.