మండలంలో ఘనంగా రంజాన్ వేడుకలు

నవతెలంగాణ – కమ్మర్ పల్లి

మండలంలోని ఆయా గ్రామాల్లో గురువారం రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. పండుగను  పురస్కరించుకొని  ఉదయమే కొత్త బట్టలు ధరించి ఈద్గాల వద్దకు చేరుకున్న ముస్లిం సోదరులు సామూహికంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ఇరుగుపొరుగు వారిని ముస్లింలు తమ ఇంటికి ఆహ్వానించి ప్రత్యేకంగా తయారు చేసిన సేమియా పాయసాన్ని పంపిణీ చేశారు. పలు గ్రామాల్లో ముస్లిం సోదరులకు కాంగ్రెస్ పార్టీ, బిఆర్ఎస్ పార్టీ నాయకులు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మండలంలోని ఉప్లూర్ లో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్ ఈద్గా వద్దకు వెళ్లి ముస్లిం సోదరులకు రంజాన్  పండుగ శుభాకాంక్షలు తెలిపారు.