
రామగిరి మండలంలోని పలు ఎరువులు, పురుగుల మందుల దుకాణాలు తనఖి చేసిన మండల వ్యవసాయ అధికారి బండి ప్రమోద్ కుమార్. రికార్డులో ఉన్న స్టాక్, గోదాములో ఉన్న సరుకులను సక్రమంగా ఉన్నాయా? లేదా? అని పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ… అధిక ధరలకు ఎరువులు, పురుగుల మందులు, విత్తనాలు విక్రంయించినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అలగే ఎరువులు, పురుగుల మందులు, విత్తన నాణ్యతపై అనుమానాలు ఉన్న వాటి నమూనాలను సేకరించి, ప్రయోగశాలలకు పంపి పరీక్షలు చేయించడం జరుగుతుందన్నారు. ఫలితాల్లో నాణ్యత లేదని తేలితే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లో అనుమతిలేని ఎరువులు,మందులు అమ్మకూడదన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అమ్మలన్నారు. అధిక ధరలకు అమ్మకూడదన్నారు. అనుమతిలేని ఎరువులు అమ్మినా, అధిక ధరలకు అంటగట్టిన చర్యలు తప్పవని అయన హెచ్చరించారు.