
నల్గొండ జిల్లా పెద్దవూర మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను శనివారం ఏటీడబ్ల్యూ శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాజరు పట్టికను,వసతి గృహ పరిసరాలు, తరగతి గదులు, వసతి సౌకర్యాలను, భోజనశాలను పరిశీలించి, విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడారు. హాస్టల్‌లో ప్రతి విద్యార్థినితో మాట్లాడుతూ.. క్రమశిక్షణతో చదువుకొని, ఉన్నత స్థానాల్లో ఉద్యోగాలు సాధించాలని, వసతి గృహంలో అందుతున్న వసతులు, సౌకర్యాలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈయన వెంట పాఠశాల హెచ్ఎం బాలాజీ, వార్డెన్ కొల్లు బాలకృష్ణ తదితరులు ఉన్నారు.