
బీజేపీ మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడిగా మండలంలోని బొమ్మకల్ గ్రామానికి చెందిన రంగు రాములు గౌడ్ నియమితులయ్యారు. శనివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు యలమంచిలి వెంకటేశ్వర రావు చేతుల మీదుగా నియమక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా రంగు రాములు గౌడ్ మాట్లాడుతూ.. పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం కృషి చేస్తామని అన్నారు. తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.