నవతెలంగాణ – హలియా
మహిళలు రంగవల్లి లక్కీ వంటింటి లకే పరిమిత కాకుండా రాజకీయ చైతన్యం కూడా పెంపొందించుకోవాలని హైద్రాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి పిలుపునిచ్చారు.హాలియాలో పదో వార్డులో ఐద్వా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ముగ్గుల పోటీకి ముఖ్యఅతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాటు నుంచి నేటి వరకు పాలకులు మహిళల పట్ల చిన్నచూపే చూస్తున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. నేటి ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సమాజంలో సగభాగం ఉన్న మహిళలకు రాజకీయంగా ఆర్థికంగా సగభాగం అవకాశాలు కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. గ్రామాల్లో బెల్ట్ షాపుల ద్వారా మద్యం ఏరులై పారుతుందని మద్యానికి బానిసైన కుటుంబాలు ఇంటి పెద్దను కోల్పోయి వీధిన పడుతున్నారని తక్షణమే బెల్ట్ షాపులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షులు పోలె బోయిన వరలక్ష్మి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అవుతా సైదులు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కత్తి శ్రీనివాసరెడ్డి ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి కారంపూడి ధనమ్మ,రేవెల్లి వెంకటేశ్వర్లు పొదిల వెంకన్న, జటావత్ రవి నాయక్ ప్రైస్ దాతలు బందులు సైదులు,సంతోష్, పుష్పలత జిల్లా సైదులు తదితరులున్నారు.