ఆస్పత్రి ఆవరణలో ఆహ్లాదం పంచుతున్న రంగవల్లులు..

– సామాజిక ఆరోగ్య కేంద్రంలో సంక్రాంతి సంబురాలు…

నవతెలంగాణ – అశ్వారావుపేట
రకరకాల రంగుల్లో పలు విధాలు గా కనిపిస్తున్న ఈ రంగవల్లులు వ్యక్తిగత గృహంలో నో లేక కార్పోరేట్ సంస్థ భవన సముదాయం ప్రాంగణంలో ఉంటే మనం ఆశ్చర్యం పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జనవరిలో,సంక్రాంతి పండుగ సందర్భంగా మన సర్వసాధారణం. కానీ ఎపుడూ ప్రమాదాలతో వచ్చిన క్షతగాత్రులు బాధలు, సీజనల్ గా వచ్చే చిరు వ్యాధులు,దీర్ఘకాలిక బాధలతో వచ్చే బాధితుల రోదనలు,వీరితో వచ్చే సహాయకులు హడావుడీ, అటు ఇటు తిరిగే వైద్యులు తో రద్దీగా కనిపించే ఆసుపత్రిలో ఇలాంటి రంగుల రంగుల ముగ్గులతో ఆహ్లాదం ఆనందాన్ని ఇస్తుంటే మాత్రం కచ్చితంగా ఆసక్తి కలిగించే విషయమే.
ఆహ్లాదం పంచే లా ఆసుపత్రుల ప్రాంగణాలు ఉండాలనే డీసీహెచ్చెస్ డాక్టర్ రవిబాబు సూచనలు మేరకు సామాజిక ఆరోగ్య కేంద్రాల ప్రాంగణాలు ను సంక్రాంతి సంబరాలు నేపధ్యంలో అశ్వారావుపేట సీ హెచ్ సి సూపరింటెండెంట్ డాక్టర్ విజయ్ కుమార్ నేతృత్వం లో ఆసుపత్రి సిబ్బంది రంగవల్లులు తీర్చిదిద్దారు. అనంతరం బహుమతులు ప్రదానం చేశారు. ఈ ముగ్గులను ఆసుపత్రికి వచ్చిన ప్రతీ ఒక్కరు ఆసక్తి గా తిలకిస్తూ ఉన్నవారు. రోగులు ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్ ఎం ఓ డాక్టర్ కృష్ణ కాంత్, మిగతా వైద్యులు డాక్టర్ అరుణ్ కాంత్, డాక్టర్ భవ్య, స్టాఫ్ నర్స్ లు, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.