ప్రతి ఒక్కరికీ ఇష్టమైన పండుగ హోళీ అటువంటి రంగోలి పండుగ వేడుకలను మండల వ్యాప్తంగా సోమవారం హర్షాతిరేకాలు మద్య కేరింతలు కొడుతూ ఉత్సాహంగా జరుపుకున్నారు. పట్టణంలోని పలు వీధుల్లో యువతీ,యువకులతో పాటు చిన్నారులు,పెద్దలు సైతం ఉదయమే రకరకాల రంగులను సిద్ధం చేసుకుని ఒకరిపై ఒకరు చల్లుకుంటూ వేడుకలు జరుపుకున్నారు.సంతోషానికి ప్రతీకగా నిలిచే ఈ హోళీ పండుగ వేడుకను ఉత్సాహంగా జరుపుకోవటం సంతోషంగా ఉందని పలువురు పేర్కొన్నారు.కల్మషం లేని మనస్సుతో ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించాలనే ఉద్దేశమని ఇటువంటి పండుగను హానికరం కాని కాలుష్యం లేని రంగులతో జరుపుకోవాలని మన పూర్వీకులు ఆలోచించారు.