నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలో గల ఐకెపి కార్యాలయంలో గురువారం రోజు డ్వాక్రా మహిళలకు రంగోలి, మెహేంది పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. రంగోలిలో మొదటి బహుమతి కన్నా రెడ్డి గ్రామానికి చెందిన సుజాతకు ఏపీఎం జగదీష్ బహుమతి అందజేశారు. అదేవిధంగా పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ బహుమతులు అందించినట్లు ఏపీఎం జగదీష్ తెలిపారు. కార్యక్రమంలో మండల సమక్య పాలకవర్గ సభ్యులు లక్ష్మీ . సీసీలు నారాయణ శ్రీనివాస రెడ్డి రమేష్ రవి తదితరులు పాల్గొన్నారు.