– విద్యార్ధునిలను అభినందించిన ప్రిన్సిపాల్ స్పందన….
నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలం లోని పెద్ద వాగు ప్రాజెక్టు లో గల గిరిజన గురుకుల బాలికల డిగ్రీ కళాశాల (దమ్మపేట) లో గురువారం రంగోలి పోటీలు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ వి.స్పందన పర్యవేక్షణలో అధ్యాపకులు,బోధనేతర సిబ్బంది,విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల ముగ్గులు (రంగవల్లులు) చిత్రీకరించారు. రంగోలి పోటీలలో 20 మంది విద్యార్థులు పాల్గొన్నారు.ఆసక్తికరం గా ఉన్న ముగ్గులతో బీ.కామ్,సీఏ రెండో సంవత్సరం విద్యార్ధిని టి.రామలక్ష్మి మొదటి బహుమతి,బీ.కామ్,సీఏ మూడో సంవత్సరం విద్యార్ధిని జి.దీపిక రెండో బహుమతి, జి దీపిక,బీఏ రెండో సంవత్సరం విద్యార్ధిని పి.నవ్య మూడో స్థానం బహుమతులను గెలుపొందారు.వీరిని ప్రిన్సిపాల్ స్పందన అభినందించారు. ఈ కార్యక్రమంలో అరుణ పాల్గొన్నారు.