ఆసియా గేమ్స్‌కు ప్రాబబుల్స్‌లో రాణికి దక్కని చోటు

న్యూఢిల్లీ : ఆసియా క్రీడల ప్రాబబుల్స్‌లో భారత మాజీ కెప్టెన్‌ రాణి రాంపాల్‌కు చోటు దక్కలేదు. ఆసియా క్రీడలకు 34 మందితో కూడిన ప్రాబబుల్స్‌ను హాకీ ఇండియా శనివారం ప్రకటించింది. ఆసియా క్రీడల శిక్షణ శిబిరం ఆదివారం మొదలై సెప్టెంబర్‌ 18న ముగియనుంది.